ప్రతి సమస్యా పరిష్కరిస్తాం: మంత్రి
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:15 PM
ప్రతిసమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
సాలూరు,ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి):ప్రతిసమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూ రులో ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు పలువురు అర్జీలను అందజేశారు. రైతులు సాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరా అంతరాయం, ఎరు వులు, విత్తనాల లభ్యతపై తమ సమస్యలను వివరించారు.రహదారి మరమ్మతులు, తాగునీటి సమస్యలు, గ్రామాల్లో డ్రైనేజీ సమస్యలపై మరికొందరు వినతిపత్రాలు అందజేశారు.ఇళ్లసమస్యలపై పలువురు విన్నవించారు.దీంతో మంత్రి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు.