Share News

అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:06 AM

నియోజ కవర్గం నుంచి అర్జీదారులు ఇచ్చిన వినతులన్నీ పరిష్క రిస్తామని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.

అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం

భోగాపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నియోజ కవర్గం నుంచి అర్జీదారులు ఇచ్చిన వినతులన్నీ పరిష్క రిస్తామని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. ముంజేరు సమీప జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఇంటి పట్టాలు, తుఫాన్‌ షెల్టర్‌, శ్మశానవాటిక, సీసీ రోడ్లు, మురుగు కాలువ, గ్రంథాలయం తదితర వాటిపై వినతులు అందాయి. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అర్జీదారులకు హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

పంచాయతీల విభజనపై వినతులు..

లక్కవరపుకోట, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శనివారం ఎల్‌.కోటలోని తమ నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పంచాయతీల విభజనపై వినతులు అందాయి. కల్లేపల్లి పంచాయతీ నుంచి పూడివానిపాలెం, సీతా గొర్లెవాని పాలెం గ్రామాలను, మల్లివీడు పంచాయతీ నుంచి కొత్తపాలెం గ్రామాన్ని విడదీయాలని వినతిపత్రాలు అందించారు. అలాగే రంగరాయపురం పంచాయతీ సరిహద్దులు తేల్చాలని మాజీ జడ్పీటీసీ కరెడ్ల దరఖాస్తు చేశారు. 1995లో విభజన చేసిన గెజిట్‌ నఖలు ఇవ్వా లని దాని ప్రకారం సంతపేట, ఎల్‌.కోట, రంగారా యపురం సరిహద్దులు తేల్చాలన్నారు. వీటితో పాటు అనేక సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. ఈ సమావేశానికి దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ రత్నాజీ, ఏఎంసీ చైర్మన్‌ మల్లునాయుడు, పీఏసీఎస్‌ చైర్మన్‌ జీఎస్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:06 AM