Share News

సమస్యలన్నీ పరిష్కరిస్తాం

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:03 AM

నియోజకవర్గంలోని ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జనవాహిని కార్యక్రమం నిర్వహించారు.

సమస్యలన్నీ పరిష్కరిస్తాం
వీరఘట్టం: సీఎంరిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజేస్తున్న జయకృష్ణ:

పాలకొండ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జనవాహిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలపై వినతిప త్రాలు అందిం చారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాటా ్లడారు. కాగా దుగ్గి గ్రామానికి చెందిన వైసీపీ నుంచి 50 కుటుంబాలు, ఇద్దరు వార్డు సభ్యు లు జయకృష్ణ ఆధ్వర్యంలో జనసేనలోనికి చేరారు. అలాగే మండలంలోని వెలగవా డ గ్రామానికి చెందిన గొడే సింహాచలానికి రూ.1,69,647 సీఎం సహాయనిధిని క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అందించారు.

ఫ వీరఘట్టం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నడుకూరుకు చెందిన మత్స పోలి నాయుడుకు వీరఘట్టంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రూ.25 వేలు సీఎం ఆర్‌ఎఫ్‌చెక్కు ఎమ్మెల్యే నిమ్మకజయకృష్ణ అందించారు.కార్యక్రమంలో ఉదయ్‌భాస్కర్‌, జామి లక్ష్మీనారాయణ, చింత ఉమా, వెలగవడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 12:03 AM