శాశ్వత పరిష్కారం చూపుతాం
ABN , Publish Date - May 27 , 2025 | 12:05 AM
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల కు శాశ్వత పరిష్కారం చూపుతామని పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ అన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 135 వినతులు
సీతంపేట రూరల్, మే 26(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల కు శాశ్వత పరిష్కారం చూపుతామని పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ అన్నారు. సోమవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలోని ఎస్‌ఆ ర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 135 వినతులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల పరిష్కారంలో అలస త్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వినతుల పరిష్కారాని కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అర్జీదా రులు తమ సమస్యలను మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. సీతం పేట మండలంలో మండ, రాయిమానుగూడ గ్రామాల్లో తాగునీటి ట్యాంక్ ఏర్పాటుచేయాలని పలువురు కోరారు.
అడ్వంచర్ పార్క్ పరిశీలన
స్థానిక ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్‌ను కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్‌రెడ్డిలు సందర్శించారు. పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న గిరి గ్రామద ర్శిని, స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. త్వరలో పనులు ప్రారంభించి పూర్తిచేయాలని ఐటీ డీఏ అధికారుల ను కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలన లో ఏపీవో జి.చిన్నబాబు, టీడబ్ల్యు ఈఈ పి.రమాదేవి, జిల్లా పరిశ్రమల అధికారి ఎంవీ కరుణాకర్, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, డ్వామా పీడీ కె.రామచం ద్రరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీవనం కష్టంగా ఉంది.. ఆదుకోండి
జీవనం కష్టంగా ఉంది.. ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ఓ నిరుపే ద గిరిజనుడు కలెక్టర్‌ను వేడుకున్నాడు. సోమవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతి సమర్పించాడు. కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన బొంతు వెంకట్రావు అనే గిరిజనుడు ఏడాది కిందట పక్షవా తానికి గురై మంచం పట్టాడు. దీంతో భర్త వైద్యం కోసం భార్య వనజాక్షి కూలి పనులు చేస్తూ ఇంతవర కు నెట్టుకొచ్చింది. క్రమేపి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షిణించడంతో ఐటీడీఏను ఆశ్రయించారు. తమకు ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కోరారు.
సత్వర పరిష్కారం చూపాలి: జేసీ
పార్వతీపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్ విభాగానికి ప్రజల నుంచి వచ్చిన వినతులకు సత్వర పరిష్కారం చూపాలని జేసీ ఎస్‌ఎస్ శోభిక అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో హేమలత, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డితో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ గుమ్మలక్ష్మీపురం మండలం వకనాబడి గ్రామానికి చెందిన కె.చిట్టిబాబు అర్జీ సమర్పించారు. తమ ఇళ్లు తోటపల్లి రిజర్వాయర్ ముంపునకు గురైనప్పటికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీగానీ, ఎటువంటి నష్టపరిహారం అందలేదని జిమ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన ఎన్.అచ్యుతరావు వినతిపత్రం అందించారు. వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. పార్వతీపురం మండలం సాకిగెడ్డలో ఆక్రమణలను తొలగించాలని కోరుతూ సాకిగడ్డ నీటి సంఘం అధ్యక్షుడు బి.సూర్యనారాయణతో పాటు టీడీపీ నాయకులు శంకరరావు, గౌరీశంకర్ కోరారు. దీంతో జేసీ స్పందించి.. ఆ ప్రాంతాన్ని సందర్శించి నివేదికలు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.