Share News

We will seize those vehicles. ఆ వాహనాలను సీజ్‌ చేస్తాం

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:50 PM

We will seize those vehicles. జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే వారి బస్సులు సీజ్‌ చేస్తామని రవాణాశాఖ ఉప కమిషనర్‌ మణికుమార్‌ హెచ్చరించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం నగరంలోని ఎల్‌ఐసీ బిల్డింగ్‌ వద్ద బస్సులను తనిఖీ చేశారు. రికార్డులు, బస్సులోపల సీట్లు, ఫైర్‌ ఎగ్జిట్‌ డోర్లు, ఎమర్జెన్సీ డోర్లును పరిశీలించారు.

We will seize those vehicles. ఆ వాహనాలను సీజ్‌ చేస్తాం
బస్సు రికార్డులను పరిశీలిస్తున్న రవాణాశాఖాధికారులు

ఆ వాహనాలను సీజ్‌ చేస్తాం

ఎగ్జిట్‌ డోర్‌ను పగలగొట్టిన డీటీసీ మణికుమార్‌

విజయనగరం క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే వారి బస్సులు సీజ్‌ చేస్తామని రవాణాశాఖ ఉప కమిషనర్‌ మణికుమార్‌ హెచ్చరించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం నగరంలోని ఎల్‌ఐసీ బిల్డింగ్‌ వద్ద బస్సులను తనిఖీ చేశారు. రికార్డులు, బస్సులోపల సీట్లు, ఫైర్‌ ఎగ్జిట్‌ డోర్లు, ఎమర్జెన్సీ డోర్లును పరిశీలించారు. ఒక బస్సుకు ఎమర్జన్సీ డోర్‌ క్లోజ్‌ అయి ఉండడంతో పగలగొట్టి తెరిపించారు. అలాగే నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతిరోజు రాజాపులోవ, జొన్నాడ వద్ద బస్సులను తనిఖీ చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా సీట్‌ ఆల్ట్రనేషన్‌లు చేసుకోవాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలతో పాటు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. తనిఖీల్లో సీనియర్‌ ఎంవీఐలు శశికుమార్‌, వెంకటరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 11:50 PM