శివారు భూములకూ సాగునీరు అందిస్తాం
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:58 PM
మడ్డువలస రిజ ర్వాయర్ నుంచి ఆయకట్టు శివారు భూములకు నీరు అందించటమే ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
ఎమ్మెల్యే కోండ్రు
వంగర, జూలై 7(ఆంధ్రజ్యోతి): మడ్డువలస రిజ ర్వాయర్ నుంచి ఆయకట్టు శివారు భూములకు నీరు అందించటమే ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. మడ్డువలస కుడి ప్రధాన కాలువ ద్వారా సోమవారం ఆయన నీరు విడుదల చేశారు. ముందుగా ప్రధాన కాలువ మోటార్లు, గంగమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం కాలువ ద్వారా నీరు విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మడ్డువలస రిజర్వాయర్ ద్వారా ఖరీఫ్‌లో వంగర నుంచి లావేరు వరకు 40 ఎకరాల ఆయ కట్టుకు నీరు సరఫరా చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీపీఎఫ్ గ్రాంటు కింద రూ.2కోట్లతో కుడి ప్రధాన కాలువలో పూడికలు తీయటానికి చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు జల వనరులు శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారని చెప్పారు.