పంట నష్టానికి తగిన పరిహారం అందజేస్తాం
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:11 AM
ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా ఎక్కడైనా పంట నష్టం జరిగితే తగిన నష్ట పరిహారం అందజేస్తామ ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
మంత్రి శ్రీనివాస్
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా ఎక్కడైనా పంట నష్టం జరిగితే తగిన నష్ట పరిహారం అందజేస్తామ ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం ఆయన విజయనగరంలోని తన క్యాంపు కా ర్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. గత రెండు రోజు లుగా జిల్లాలో ఈదురు గాలుల వల్ల పలు విద్యుత్ లైన్లకు నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే వాటిని బాగుచేసి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని చెప్పారు. జిల్లాలో పంట నష్టం వివరాలను అధికారులు ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన ఆదేశించారు.
పెండింగ్ సమస్యలకు మోక్షం
ఇటీవల దత్తి గ్రామంలో సీఎం పర్యటన విజయవం తం అయ్యిందని మంత్రి అన్నారు. ఎన్నో ఏళ్లగా సార్వ గెడ్డ మినీ రిజర్వాయర్ అపరిష్కృతంగా ఉందని, సీఎం పర్యటన ద్వారా పరిష్కారం లభించిందన్నారు. జిల్లాలో సుదీర్ఘ కాలంలో పెండింగ్‌లో సమస్యలకు మోక్షం కలుగనుందని చెప్పారు.