ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:46 PM
ప్రజల అభిప్రాయం మేరకే క్వారీ తవ్వకాలు జరగాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని తేల్చిచెప్పారు.
పార్వతీపురం రూరల్,ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ప్రజల అభిప్రాయం మేరకే క్వారీ తవ్వకాలు జరగాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని తేల్చిచెప్పారు. గురువారం పార్వతీపురం మండలం లోని బడిదేవర కొండ వద్ద జరుగుతున్న గ్రానైట్ తవ్వకాలను ప్రజల ఫిర్యాదు మే రకు పరిశీలించారు. క్వారీ తవ్వకాల వలన తమ ప్రాంతంలో చెరువులు కలుషితం అవుతున్నాయని, బడిదేవర కొండ వద్ద బడిదేవర దేవతను నిత్యం పూజిస్తామని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. ఇక్కడ క్వారీ తవ్వకాలకు అనుమతులు మం జూరుచేయడంతో తాము ఇబ్బందులుఎదుర్కొంటున్నామని తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలతో సమావేశం నిర్వహించాలని సూచించారు.