Share News

Efficiently సమర్థంగా నిర్వహిస్తాం

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:19 AM

We Will Handle It Efficiently పార్వతీపురం మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ విషయంలో సంబంధిత అధికారుల్లో కదలిక వచ్చింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పదకొండు దుకాణాల బహిరంగ వేలానికి సంబంఽధించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఈసారైనా వస్తారా?’ అనే కథనంపై ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించారు.

  Efficiently  సమర్థంగా నిర్వహిస్తాం
మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఫ్లోరింగ్‌ పనులు చేస్తున్న దృశ్యం

  • మునిసిపల్‌ అధికారుల వెల్లడి

  • షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఫ్లోరింగ్‌ పనులు

  • ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

పార్వతీపురం టౌన్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ విషయంలో సంబంధిత అధికారుల్లో కదలిక వచ్చింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పదకొండు దుకాణాల బహిరంగ వేలానికి సంబంఽధించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఈసారైనా వస్తారా?’ అనే కథనంపై ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించారు. ఏఈ అప్పారావు ఆధ్వర్యంలో షాపుల స్లాబ్‌, ఫ్లోరింగ్‌ మరమ్మతు పనులు చేపట్టారు. వారం, పది రోజుల్లో వాటి పనులు పూర్తిచేస్తామని ఏఈ తెలిపారు. ఇకపై పదకొండు షాపుల నిర్వహణ బాధ్యతలు చేపడతామని వెల్లడించారు. దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌ (ఎఫ్‌ఏసీ) శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. షాపింగ్‌ కాంప్లెక్స్‌ చుట్టూ ఉన్న ఆక్రమణల తొలగింపుపై ఆదేశాలు జారీ చేశామన్నారు. మునిసిపాలిటీకి ఆదాయాన్ని ఇచ్చే షాపులపై దృష్టి పెట్టి.. సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - Nov 22 , 2025 | 12:19 AM