కోరిన పరిహారమిస్తేనే భూములిస్తాం
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:43 PM
పోలవరం కాలువ కోసం ప్రభుత్వం తాము కోరిన పరిహారం ఇస్తేనే భూములిస్తామని వీర నారాయణం, దాంపురం గ్రామస్థులు తేల్చిచెప్పారు.
ఎస్.కోట రూరల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం కాలువ కోసం ప్రభుత్వం తాము కోరిన పరిహారం ఇస్తేనే భూములిస్తామని వీర నారాయణం, దాంపురం గ్రామస్థులు తేల్చిచెప్పారు. మంగళవారం పోలవ రం ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్రామసభలు స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్ కళా వతి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈసందర్భంగా వీరనారాయణం గ్రామస్థు లు ఎకరాకు రూ.50లక్షలు, దాంపురం గ్రామస్థులు ఎకరాకు రూ.80లక్షలు కావాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.