న్యాయం జరిగే వరకూ పోరాడుతాం
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:02 AM
న్యాయం జరిగే వరకూ పోరాడుతా మని జిందాల్ నిర్వాసితులు తెలిపారు. జిందాల్ పరిశ్రమ తమను మోసం చేసి భూమి సేకరించిందని వాపోయారు.
ఎస్.కోట రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): న్యాయం జరిగే వరకూ పోరాడుతా మని జిందాల్ నిర్వాసితులు తెలిపారు. జిందాల్ పరిశ్రమ తమను మోసం చేసి భూమి సేకరించిందని వాపోయారు. 18 ఏళ్లుగా పరిశ్రమ ఏర్పాటుచేయకుండా తమను నిలువున ముంచేశారని ఆరోపించారు.ఈవిషయంపై 135రోజులుగా శాంతియుత పోరా టం చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ఆదివారం బొడ్డవరలో రిలేదీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ కాశీబుగ్గలో భక్తుల ప్రాణాలు పోయాయంటే ఆగమేఘా ల మీద మంత్రులు వెళ్లారని తెలిపారు. బాధితులకు ధైర్యంచెప్పి వారికి వైద్యసేవలు అందించి ప్రభుత్వ పరంగా పరిహారం ప్రకటించి అండగా నిలిచారని చెప్పారు.అయితే తమ భూములు పోయాయని గల్లీనుంచి ఢిల్లీదాక నిరసనలు చేస్తున్న ఎందుకు పట్టిం చుకోలేదని ప్రశ్నించారు.