Share News

We will expand the Pydimamba temple rapidly. పైడిమాంబ ఆలయాన్ని వేగంగా విస్తరిస్తాం

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:20 AM

We will expand the Pydimamba temple rapidly. పైడిమాంబ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశామని దేవస్థానం కమిటీ చైర్మన్‌, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు తెలిపారు. నగరంలోని పైడిమాంబ చదురుగుడి వద్ద విస్తరణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

We will expand the Pydimamba temple rapidly. పైడిమాంబ ఆలయాన్ని వేగంగా విస్తరిస్తాం
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, ఎంపీ తదితరులు

పైడిమాంబ ఆలయాన్ని వేగంగా విస్తరిస్తాం

దేవస్థానం కమిటీ చైర్మన్‌, గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు

పనులకు శంకుస్థాపన

విజయనగరం/ రూరల్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశామని దేవస్థానం కమిటీ చైర్మన్‌, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు తెలిపారు. నగరంలోని పైడిమాంబ చదురుగుడి వద్ద విస్తరణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ కామన్‌ గుడ్‌ ఫండ్‌, ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కలిపి రూ.కోటీ 80 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఆలయం విస్తరణ వల్ల భక్తులు మరింత సునాయసంగా, వేగంగా పైడిమాంబను దర్శించుకోవచ్చునన్నారు. గత కొన్నేళ్లుగా విస్తరణ పనులు చేపట్టాలని అనుకున్నా, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందన్నారు. టెండర్ల ప్రక్రియ, డీపీఆర్‌ సిద్ధమైన నేపథ్యంలో పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి అవుతాయని చెప్పారు. పైడిమాంబ ఆలయ విస్తరణ పనులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కలెక్టరు రామసుందర్‌రెడ్డి, ఆలయ ఈవో కె.శిరీషతో పాటు పైడిమాంబ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు కామేష్‌ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనకు ముందు పైడిమాంబను గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Updated Date - Oct 10 , 2025 | 12:20 AM