Share News

We will develop the Pydimamba temple. పైడిమాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:06 AM

We will develop the Pydimamba temple. పైడిమాంబ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మాన్సాస్‌ చైర్మన్‌, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు చెప్పారు.

We will develop the Pydimamba temple. పైడిమాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు దంపతులకు పైడిమాంబ చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేస్తున్న ఆలయ ఈవో శిరీష

పైడిమాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం

మాన్సాస్‌ చైర్మన్‌, గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు

ఆలయ మార్యాదలతో స్వాగతం

విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మాన్సాస్‌ చైర్మన్‌, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు చెప్పారు. సోమవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో నగరంలోని పైడిమాంబ ఆలయానికి అశోక్‌గజపతిరాజు గవర్నర్‌ హోదాలో తొలిసారిగా వచ్చారు. ఆయన వెంట సతీమణి సునీలా గజపతిరాజు ఉన్నారు. ఈవో శీరిష, అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం అశోక్‌ గజపతిరాజు దంపతులు అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా ఆలయ బయట ఆయన విలేకర్లతో మాట్లాడారు. పైడిమాంబ ఆలయ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని, స్థల సేకరణ పూర్తయిందని, అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న దానిపై డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)సిద్ధమౌతున్నదన్నారు. రాష్ట్రంలో ఆలయాలకు పూర్తి రక్షణ ఉందని, ఏడాదిన్నర ప్రభుత్వ కాలంలో ఏ దేవాలయం ధ్వంసం కాలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి లేదని, ఐదేళ్ల ఆ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ధ్వంసం అయ్యాయన్నారు. ఈనేపథ్యంలోనే ప్రజలు ధ్వంసాలకు పాల్పడే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపారన్నారు. భవిష్యత్తులో మళ్లీ ధ్వంసాలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటే ఈ రాష్ట్రం, రాష్ట్రంలో ఉన్న ఆలయాలు గోవిందా..గోవిందేనని ఆయన ఎద్దేవా చేశారు.

Updated Date - Sep 02 , 2025 | 12:06 AM