Savara Arts సవర ఆర్ట్స్‌ను అభివృద్థి చేస్తాం
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:51 PM
We Will Develop Savara Arts సవర ఆర్ట్స్ అభివృద్థికి కృషిచేస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పీఎంఆర్‌సీలో ఏపీ టిడ్కో సంస్థ ఆధ్వర్యంలో సవర ఆర్ట్స్‌పై ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు.
సీతంపేట రూరల్,ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): సవర ఆర్ట్స్ అభివృద్థికి కృషిచేస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పీఎంఆర్‌సీలో ఏపీ టిడ్కో సంస్థ ఆధ్వర్యంలో సవర ఆర్ట్స్‌పై ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గిరిజన చిత్రకళాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఆయా చిత్రకళలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. కళాకా రులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈనెల 9న ఐటీడీఏ వేదికగా నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లపై సెక్టోరియల్ అధికారులు, పోలీస్ సిబ్బందితో సమీక్షించారు. ఆదివాసీ దినోత్సవం రోజున నిర్వహించనున్న శోభాయాత్రలో గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అందరి వేషధారణలు ఉండాలన్నారు. గిరిజన నృత్యాలతో ఊరేగింపు ఉంటుందన్నారు. ఐటీడీఏ ప్రధాన గేటు వద్ద ఉన్న అడవితల్లి విగ్రహానికి రంగులు వేయాలని ఆదేశించారు. అన్ని శాఖలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని, వేడుకలను వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీవో చిన్నబాబు, డీడీ అన్నదొర, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, పాలకొండ సీఐ చంద్రమౌళి పాల్గొన్నారు.