వంతెన పనులు పూర్తి చేస్తాం
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:08 AM
సువర్ణముఖి నదిపై వంతెన పనులను జూన్ నెలలోగా పూర్తి చేస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
సీతానగరం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): సువర్ణముఖి నదిపై వంతెన పనులను జూన్ నెలలోగా పూర్తి చేస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సీతానగరంలోని సువర్ణముఖి నది వంతెన పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. సైట్ ఇంజినీర్లతో మాట్లాడి వంతెన పనుల్లో రాజీ పడొద్దని సూచించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గెడ్డలుప్పి పనులను పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బూర్జ నుంచి చినం కలాం వెళ్లడానికి మధ్యలో సువర్ణముఖి నదిపై వంతెన ప్రతిపాదనలు పంపించామని అన్నారు. గత ప్రభుత్వం లో మాజీ ఎమ్మెల్యే పాత వంతెనపై మరమ్మతుల కోసం రూ.1.29 కోట్లు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. బలిజిపేట మండలం నారాయణపురం వంతెన పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పెంట సత్యం నాయుడు, ప్రతినిధులు రౌతు వేణుగోపాల్‌నాయుడు, తేలు శేఖర్, తెంటు వెంకట అప్పలనాయుడు, పైలా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.