బాధితులను ఆదుకోవడంలో ముందుంటాం
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:13 PM
ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర ఎం ఎస్‌ఎంఈ సెర్ప్, ఎంఎస్‌ఎంఈ సెర్ప్ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీని వాస్ తెలిపారు.
విజయనగరం కలెక్టరేట్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర ఎం ఎస్‌ఎంఈ సెర్ప్, ఎంఎస్‌ఎంఈ సెర్ప్ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీని వాస్ తెలిపారు.ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్ అందజేశారు.గంట్యాడ మండలంలోని రేగుబిల్లి గ్రామానికి చెం దిన కంచి పద్మావతికి రూ 1,16,414, గజపతినగరం మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన పట్నాన్ సురేష్ కుమారుడు సూర్య స్వాతిక్‌కు రూ.48,401 చెక్కును పంపిణీచేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబునాయుడు రాసిన లేఖను బాఽధితులకు మంత్రి అందజేశారు. కార్యక్ర మంలోని నాయకులు, లబ్ధిదారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.