పోరాటాలతో హక్కులు సాధిస్తాం
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:58 PM
పోరాటాల ద్వారా కార్మిక, కర్షకుల హక్కు లు సాధిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరిసింగరావు స్పష్టం చేశారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సంఘం జిల్లా మహాసభలు ప్రారంభం
రాజాం రూరల్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పోరాటాల ద్వారా కార్మిక, కర్షకుల హక్కు లు సాధిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరిసింగరావు స్పష్టం చేశారు. రాజాంలో ఆదివారం ప్రారంభమైన సీఐటీయూ 11వ జిల్లా మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రూ.26వేలు కనీసవేతనంగా ఇవ్వాలని, అవుసోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు బస్టాండ్ నుంచి చీపురుపల్లి రోడ్డులోని సభా ప్రాంగణం వరకూ పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు సుబ్బ రావమ్మ, సురేష్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.