Share News

Farmers రైతులకు అండగా నిలుస్తాం

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:05 AM

We Stand by the Farmers తుఫాన్‌ కారణంగా పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పరిహారం చెల్లిస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రత్యేకాధికారి గుప్త, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి ఇతర అధికారులతో సమీక్షించారు. దెబ్బతిన పంటలను పరిశీలించి నష్టపరిహారంపై నివేదిక అందించాలన్నారు.

  Farmers  రైతులకు అండగా నిలుస్తాం
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • 90 వేల దోమతెరల పంపిణీ

  • మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పరిహారం చెల్లిస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రత్యేకాధికారి గుప్త, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి ఇతర అధికారులతో సమీక్షించారు. దెబ్బతిన పంటలను పరిశీలించి నష్టపరిహారంపై నివేదిక అందించాలన్నారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆమె వెల్లడించారు. సీతంపేట మండలంలో అరటి పంట రైతులకు నిబంధనల పేరిట కష్టం కలిగించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. రైతుల కష్టాన్ని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. విద్యుత్‌ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జిల్లాపై తుపాను ప్రభావం ఏ విధంగా ఉందనే విషయాన్ని డిజిటల్‌ స్ర్కీన్‌ ద్వారా కలెక్టర్‌ వివ రించారు. గెడ్డలు, వాగులు, ప్రాజెక్టుల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలో పిడుగులు పడే పరిస్థితి ఉందని, దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే విద్యాలయాలకు సెలవులను పొడిగించాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. ప్రాజెక్టు ప్రాంతాల్లో అదే విధంగా ఎక్కడైనా చెరువులకు గండి పడిన వెంటనే ఇసుక బస్తాలను తరలించాలన్నారు. కాగా సాలూరు, మక్కువ ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచామని ఇరిగేషన్‌ శాఖాధికారులు తెలిపారు. అత్యవసరమైతే ప్రజలు 1912, 100 లేదా 101కు ఫోన్‌ చేయాలని, మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజన వసతిగృహాల్లో విద్యార్థులకు 90 వేల దోమ తెరలు అందిస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేశామని, మందులన్నీ అందు బాటులో ఉన్నాయని వెల్లడించారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయొద్దన్నారు.

సీఎం నుంచి మంత్రికి ఫోన్‌...

కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూంలో అధికారులతో సమీక్షిస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు నుంచి మంత్రి సంధ్యారాణికి ఫోన్‌ వచ్చింది. తుఫాన్‌ ప్రభావం, తీసుకుంటున్న చర్యలపై మంత్రి వివరించారు. ఐటీడీఏల పరిధిలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టున్నామన్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందిస్తున్నామని, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎంకు తెలియజేశారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డికి ఫోన్‌ రాగా.. జిల్లాలో పరిస్థితిని ఆయన వివరించారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2025 | 12:05 AM