నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:16 AM
నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని నూతన చైర్‌పర్సన్ ఆకుల మల్లీశ్వరికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సూచించారు.
నూతన చైర్‌పర్సన్‌కు ఎమ్మెల్యే జయకృష్ణ సూచన
పాలకొండ, ఏప్రిల్ 29 (ఆంరఽధజ్యోతి): నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని నూతన చైర్‌పర్సన్ ఆకుల మల్లీశ్వరికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆమెను అభినందించారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడారు. తనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన కూటమి ప్రభుత్వానికి, స్థానిక రెల్లికుల అభివృద్ధి సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పల్లా కొండలరావు, రెల్లికుల సంఘం నాయకులు మజ్జి బాబ్జీ, బెవర ప్రసాద్, లోకొండ గణేష్, పిన్నింటి బాలరాజు, కొట్నాన అప్పన్న, సొండి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన మల్లీశ్వరికి కూటమి పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, పాలకొండ ఎంపీపీ బొమ్మాళి భాను, సుధాకరరావు దంపతులు అభినందనలు తెలిపారు.
టీడీపీ నాయకుడు పల్లా కొండలరావును నూతనంగా ఎన్నికైన నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఆకుల మల్లీశ్వరి మంగళవారం పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూ ర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువతో సత్కరించారు. పార్టీలకతీతంగా పని చేస్తూ పాలకొండను అభివృద్ధి బాటలో నడపాలని కొండలరావు ఆమెకు మార్గనిర్దేశం చేశారు.