ఐక్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే అదితి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:59 PM
విజయనగరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. నగర పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గంటా రవి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
విజయనగరం రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): విజయనగరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. నగర పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గంటా రవి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు హాజరై, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నగరంలోని అన్ని డివిజన్లలో పార్టీని బలోపేతం చేసి, నగర పాలక సంస్థలో పాగా వేయాలన్నారు. పార్టీ నాయకులు గంటా రవి, పీతల కోదండరామ్, గంటా పోలినాయుడు, పాసి అప్పలనాయుడు, ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, పిళ్లా విజయ్‌కుమార్, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.