Share News

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:01 AM

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుం టుందని, రైతుల సంక్షేమానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు.

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

  • మంత్రి సంధ్యారాణి

  • ఏఎంసీ నూతన కార్యవర్గానికి అభినందన

సాలూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుం టుందని, రైతుల సంక్షేమానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. మంగళవారం సాలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె నూతనంగా ఏర్పడిన వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ కార్యవర్గాన్ని అభినందించారు. చైర్మన్‌ ముఖీ సూర్యనారాయణతో పాటు సభ్యులను సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యవ సాయ రంగం అభివృద్ధికి మార్కెటింగ్‌ కమిటీ కీలక పాత్ర పోషించాల న్నారు. అప్పగించిన బాధ్యతను అంకితభావంతో పని చేసి నియోజకవ ర్గానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోని రావాలని కోరారు. కార్యక్ర మంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, చలుమూరి వెంకటరమణ, పరమేష్‌, గుడేపు యుగంధర్‌, వాడాడ శోభారాణి, అప్పయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:01 AM