బాలల ఆరోగ్య శ్రేయస్సుకు కృషి చేయాలి
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:59 PM
ఆరోగ్య సర్వేలు, హెల్త్ స్ర్కీనింగ్‌లు సమగ్రంగా నిర్వహించి బాలల ఆరోగ్య నివేదికలను ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసి వారి ఆరోగ్య శ్రేయస్సుకు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు కోరారు.
గరుగుబిల్లి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సర్వేలు, హెల్త్ స్ర్కీనింగ్‌లు సమగ్రంగా నిర్వహించి బాలల ఆరోగ్య నివేదికలను ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసి వారి ఆరోగ్య శ్రేయస్సుకు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు కోరారు. శనివారం మండలంలోని నంది వానివలస, తోటపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు. తొలుత టీకా కార్యక్రమాన్ని తనిఖీచేశారు రికార్డులను పరి శీలించి వివరాలు స్పష్టంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల నివేదికల రికార్డులను తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్థులతో మాట్లాడి సంచార చికిత్స వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయ, వైద్య సిబ్బందితో విద్యార్థుల హెల్త్ స్ర్కీనింగ్‌పై సమీక్షించారు. కార్యక్రమంలో ఏఎంవో సూర్యనారాయణ, హెచ్‌ఎం జె.ప్రపూర్ణకుమారి, హెల్త్ సూపర్‌వైజర్ ఎం.సన్యాసమ్మ, వైద్య సిబ్బంది శ్రావణి, పద్మావతి పాల్గొన్నారు.