డ్రగ్స్ నిర్మూలనను సహకరించాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:50 PM
డ్రగ్స్ నిర్మూలనను సహకరించాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లిమర్ల నియోజకవర్గంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు అభ్యుదయ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
డ్రగ్స్ నిర్మూలనను సహకరించాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లిమర్ల నియోజకవర్గంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు అభ్యుదయ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఫడెంకాడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల వాడకం ద్వారా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆందోళన వ్యక్తంచేశారు.మండలంలోని పెదతాడివాడ మెర్సీ మిషన్ స్కూల్‌నకు మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ మంళవారం ఉదయం తొమ్మిది గంటలకు చేరుకోగా ర్యాలీని ఎమ్మెల్యే నాగమాధవి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడుల ఆధ్వర్యంలో విద్యార్థుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పల్సర్‌బైక్ రమణ గంజయి, మాదక ద్రవ్యాలపై గీతాన్ని ఆలపించి అందరికి అర్థమయ్యే రీతిలో మాదకద్రవ్యాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో నెల్లిమర్ల టీడీపీ నాయకులు కంది చంద్రశేఖరరావు, భాస్కరరావు, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, పాణిరాజు, జనసేన నాయకులు లక్ష్మిరాజ్, , పైల శంకర్, పిన్నింటి రాజారావు పాల్గొన్నారు.
ఫ భోగాపురం, నవంబరు25 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు అలవాటు పడి సంబందిత కేసులో పట్టుబడి అరెస్టైతే జీవితం నాశనం అవుతుందని సీఐ కె.దుర్గాప్రసాదురావు తెలిపారు.మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రబా వాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన సైకిల్ ర్యాలీ భోగాపురం పంచాయతీ కార్యాలయానికి చేరుకుంది.కార్యక్రమంలో ఎస్‌ఐ వి.పాపారావు, పోలీస్ సిబ్బంది, ఎంఈవో-2 చంద్రమౌళి, నాయకులు కొమ్మూరుసుభోషణరావు, పల్లంట్ల జగదీష్, ఆళ్లశ్రీనివాసరావు, గుండపు సూరిబాబు, మాతా నవీన్ పాల్గొన్నారు.
ఫపూసపాటిరేగ,సెప్టెంబర్25(ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగలో మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు అభ్యుదయ సైకిల్‌యాత్ర నిర్వహించారు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో పాటు విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు.