భూ సమస్యలు పరిష్కారానికి సహకరించాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:16 AM
భూసమస్యలను పరి ష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వేకు రైతులు సహకరించా లని మక్కువ తహసీల్దార్ కె.భరత్‌కుమార్ రైతులను కోరారు. శుక్రవారం శంబరలో రైతులతో సమావేశంఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా భూముల రీసర్వేవల్ల కలిగే ఉపయోగాలను వివరించారు.
మక్కువ రూరల్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): భూసమస్యలను పరి ష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వేకు రైతులు సహకరించా లని మక్కువ తహసీల్దార్ కె.భరత్‌కుమార్ రైతులను కోరారు. శుక్రవారం శంబరలో రైతులతో సమావేశంఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా భూముల రీసర్వేవల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. వచ్చే ఏడాది జనవరి రెండోతేదీ నుంచి శంబర పరిధిలో ఫేజ్-4 కింద భూముల రీసర్వే కార్య క్రమం జరుగుతుందని తెలిపారు. ఏరోజుఎవరి భూములు సర్వేచేస్తు న్నామన్న విషయాన్ని సంబంధిత రైతుకు ముందుగానే తెలియజేస్తామని, సర్వేచేయించుకోనున్న రైతులు తమవద్ద వున్న ఆధారాలతో హాజరు కావాలని కోరారు. తొలుత తహసీల్దార్ భరత్‌కుమార్ రైతులతో కలిసి సర్వేపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తీళ్లపోలినాయుడు, ఉపసర్పంచ్ అల్లువెంకటరమణ పాల్గొన్నారు.
14 గ్రామాల్లో రీసర్వే
గరుగుబిల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని భూసమస్యలు పరి ష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని డీటీ పి.మారుతీరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని గొట్టివలస, ఉద్దవోలులో రీసర్వే ప్రాజెక్టులో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి సంబంధించి నాలుగోవిడతలో భాగంగా జనవరి రెండోతేదీ నుంచి ఏడుగ్రామాల్లో రీసర్వే నిర్వహించనున్నట్లు తెలి పారు. మండలానికి సంబంధించి 14 గ్రామాల్లో రీసర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. జనవరిలో సర్వే ప్రారంభించి జూన్ నెలలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. తప్పులు లేని భూహక్కులు రైతులకు కల్పించేందుకు అవగాహన ర్యాలీలు, గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సంబంధిత సర్వేనెంబర్లను పరిశీలించి తదుపరి రోవర్‌తో సర్వే నిర్వ హించనున్నట్లు చెప్పారు. రైతులు తమ అభ్యంతరాలను తెలియపరిస్తే పరి ష్కరిస్తామని తెలిపారు. గ్రామసభల్లో మండల సర్వేయర్ ఎం.వెంకటరమణ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాము, రెవెన్యూ అధికారి కె.రాఘవరావు, సర్వేయర్ వెంకటేష్ పాల్గొన్నారు.
: