దోమల నివారణకు సహకరించాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:58 PM
దోమల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రపంచదోమల దినో త్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు.
దోమల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రపంచదోమల దినో త్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు.
ఫసీతంపేట రూరల్,ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి):సీతంపేటలో దోమల దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపాటించడం వల్ల దోమ లను నివారించవొచ్చని తెలిపారు. అనంతరం సర్‌రోనాల్డ్‌రోస్ చిత్రపటానికి పూల మాలను వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో ఎంపీడీవో కె.సత్యం, డీడీ అన్నదొర, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు, దోనుబాయి పీహెచ్‌సీ వైద్యాధి కారి శివశంకర్, సబ్‌యూనిట్ అధికారి జె. మోహనరావు పాల్గొన్నారు.
ఫవీరఘట్టం,ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని పీహెచ్‌సీ వైద్యులు సాయి కోరారు.ఈ మేరకు బుధశారం వీరఘట్టం పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ప్రపంచ దోమల దినో త్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు.
ఫసాలూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): సాలూరులో దోమల వల్ల వచ్చే వ్యాధు లపై ప్రజలకు అవగాహన కల్పించారు. పురపాలకసంఘం నుంచి పట్టణ ప్రధాన కూడలి వరకు వరకు కమిషనర్ టీటీ.రత్నకుమార్ ఆధ్వర్యంలో పట్టణ మలేరియా సబ్‌యూనిట్ ఆఫీసర్ ఎం.ఈశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ పారిశుధ్య సిబ్బందితో కలిసి దోమలవ్యాప్తి ద్వారా కలిగే నష్టాలను వివరిస్తూ ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.