హర్‌ఘర్ తిరంగాలో భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:37 PM
హర్‌ఘర్ తిరంగాలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు.
- కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): హర్‌ఘర్ తిరంగాలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్‌సీఎం పాఠశాల వద్ద గురువారం ఉదయం హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. 250 మీటర్ల జాతీయ జెండాతో ఆర్‌సీఎం పాఠశాల నుంచి బయలుదేరిన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మన దేశభక్తిని, స్ఫూర్తిని సమైక్యతవాదాన్ని పిల్లల్లో పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి, సెల్ఫీ తీసుకొని హర్‌ఘర్ తిరంగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులు ఎందరో ఉన్నారని, అందులో జిల్లావాసులు ఉండడం గర్వకారణమన్నారు. అటువంటి మహాభావులను స్మరించుకుంటూ, దేశం తర్వాత ఏదైనా అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో డ్వామా పీడీ కె.రామచం ద్రరావు, జిల్లా అధికారులు, వివిధ కళాశాలలు, పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.