స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలి: కిమిడి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:34 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు ఐక్యంగా పని చేసి, అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చీపురు పల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు.పని చేసే నాయకుణ్ణి ప్రజలు ఎప్పటికీ విశ్వసిస్తారని తెలిపారు. మెరకముడిదాం మండలంలోని బుదరాయవలస, శ్యామాయవలస, సాతాంవలసకు చెందిన 700 మందికి ఆదివారం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో టీడీపీకండువాలు వేసి ఆహ్వానించారు.
చీపురుపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు ఐక్యంగా పని చేసి, అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చీపురు పల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు.పని చేసే నాయకుణ్ణి ప్రజలు ఎప్పటికీ విశ్వసిస్తారని తెలిపారు. మెరకముడిదాం మండలంలోని బుదరాయవలస, శ్యామాయవలస, సాతాంవలసకు చెందిన 700 మందికి ఆదివారం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో టీడీపీకండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టును నిర్మించి, ఈ ప్రాంతానికి సాగునీరిచ్చిన చంద్రబాబు అపర భగీర థుడని తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్‌నాయుడు, నాయకులు తాడ్డి సన్యాసినాయుడు, మోతీలాల్‌నాయుడు, తాడ్డి చంద్ర, సుబ్బరాజు, రెడ్డి గోవిందరావు, కెంగువ ధనుంజయ్, బాలి బంగారునాయుడు, చంటి పాల్గొన్నారు.