శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:13 AM
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.
- జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి
జియ్యమ్మవలస, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం జియ్యమ్మవలసలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా? లేదా? అని పరిశీలించారు. పాఠశాలలో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వారికి ప్రత్యేక సూచనలు చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానాల గదుల నిర్వహణను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ ఎన్.అప్పారావు, ఎంఈవో-1 ధనుకొండ గౌరునాయుడు, ఉపాధ్యాయులు ఉన్నారు.