ఈ ఏడాది అనేక విజయాలు సాధించాం
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:21 AM
కూటమి ప్రభు త్వం 2025లో అనేక విజయాలు సాధించిందని ఎమ్మెల్యే లలిత కుమారి తెలిపారు.
లక్కవరపుకోట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభు త్వం 2025లో అనేక విజయాలు సాధించిందని ఎమ్మెల్యే లలిత కుమారి తెలిపారు. ఎల్.కోటలోని తన స్వగృహంలో ఆమె మంగళ వారం విలేకర్ల సమావేశం నిర్వహించి, విజయాలను వివరించారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారని తెలిపారు. పింఛన్ల పంపిణీ, అన్నదాత సుఖీభవ, సూపర్‌సిక్స్ పథకాలు, తల్లికి వందనం, మత్స్యకార భరోసా, ఉచిత విద్యుత్, వాహనమిత్ర, అన్నా క్యాంటీన్ల నిర్వహణ.. ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రం ముందుకు వెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.