Reservoir జలాశయాలకు జలకళ
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:24 PM
Water Glory for Reservoir గత కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలోనూ విరివిగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాలకు వదర పోటెత్తు తోంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి మంగళవారం 10 వేల క్యూసెక్కులకు పైబడి వరద నీరు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు 6 వేల క్యూసెక్కులను విడుదల చేశారు.
గరుగుబిల్లి/జియ్యమ్మవలస, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): గత కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలోనూ విరివిగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాలకు వదర పోటెత్తు తోంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి మంగళవారం 10 వేల క్యూసెక్కులకు పైబడి వరద నీరు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు 6 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రధాన కాలువల నుంచి సుమారు 1,320 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 104.54 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ఇక జియ్యమ్మవలస మండల పరిధి వట్టిగెడ్డ రిజర్వాయర్ స్పిల్‌వే గేట్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరుతుందని ఏఈ శంకరరావు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 121 మీటర్ల మేర నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.