Share News

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:08 AM

జిల్లాలోని రణస్థలం, ఆమదాల వలస, కొత్తూరు తదితర ప్రాంతాల్లో విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌కు టీడీపీ కార్యకర్తలు గురువారం ఘనస్వాగతం పలికారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ప్రభుత్వ ఆదర్శ జూనియర్‌ కాలేజీలో జరిగే మెగా పేరెంట్‌టీచర్స్‌మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనున్నారు.

 మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం
ఆమదాలవలస: మంత్రి లోకేశ్‌కు హారతి ఇస్తున్న తెలుగు మహిళలు:

జిల్లాలోని రణస్థలం, ఆమదాల వలస, కొత్తూరు తదితర ప్రాంతాల్లో విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌కు టీడీపీ కార్యకర్తలు గురువారం ఘనస్వాగతం పలికారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ప్రభుత్వ ఆదర్శ జూనియర్‌ కాలేజీలో జరిగే మెగా పేరెంట్‌టీచర్స్‌మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనున్నారు.

ఫశ్రీకాకుళం, డిసెంబరు 4(ఆంధ్రజ్యో తి): శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాకు మంత్రి లోకేష్‌ వెళ్లారు. దీంతో రణస్థలం నుంచి పాతపట్నం వరకు అన్ని నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మంత్రికి స్వాగతం పలికారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాతపట్నం ఎమ్మెల్యేలు నడుకుదిటి ఈశ్వరరావు, గొండు శంకర్‌, మామిడి గోవిందరావు భారీసంఖ్యలో కార్యకర్తలు, అనుచరులతో కలిసి మంత్రికి స్వాగతం పలకడానికి వెళ్లారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భామిని వెళ్లి అక్కడ మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్య టన ఏర్పాట్లను మంత్రి అచ్చెన్న పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

ఫరణస్థలం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పైడిభీమవరంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీతో పాటు కూటమి నేతలు డీజీఎం ఆనందరావు, బెండు మల్లేశ్వరావు, పిన్నింటి భానోజినాయుడు, రౌతు శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు, లంక ప్రభ, బాలి శ్రీను, దన్నాన మహేష్‌ తదితరులు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. భామినిలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ విమానాశ్రయంలో దిగిన లోకేష్‌ జిల్లా మీదుగా రోడ్డు మార్గం గుండా పాలకొండ వెళ్లారు. భామినిలో గురువారం రాత్రి బస చేయనున్న లోకేష్‌ టీడీపీ నేతలతో సమావేశమవుతారు.

ఫఆమదాలవలస: ఆమదాలవలసలోని ఫ్లైఓవర్‌ వద్దగల ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద నియోజకవర్గం లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు.శ్రీకాకుళం నుంచి పాలకొండ మీదుగా భామిని వెళ్లే క్రమం లో లోకేష్‌ పట్టణంలోని ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద వేచిఉన్న ప్రజలను చూసి కాన్వాయ్‌ను ఆపారు. ఆ సమయంలో టీడీపీనాయకులు మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, మొదలవలస రమేష్‌, తమ్మినేని చంద్రశేఖర్‌, నూకరాజు, సనపల ఢిల్లీశ్వరరావు పూలబొకేలతో స్వాగతం పలకగా ఎమ్మెల్యే రవికుమార్‌ సతీమణి, మాజీ ఎంపీపీ కూనల ప్రమీల, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా విద్యాసాగర్‌ హారతులిచ్చారు. ఈ సందర్భంగా కొందరు పలుసమస్యలపై అర్జీలు ఇవ్వగా పరిశీలించి సమస్యలు పరి ష్కారానికి కృషి చేస్తానని లోకేష్‌ తెలియజేస్తూ కాన్వాయ్‌ ముందుకు సాగింది.

ఫ శ్రీకాకుళం రూరల్‌, డిసెంబ రు4 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం హైవే వద్ద కొత్తరోడ్డు -రాగోలు జంక్షన్‌లో మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ శ్రేణు లు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికాయి. ఈ సందర్భం గా పలువురు పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. లోకేష్‌, శంకర్‌తో మాట్లాడారు.

Updated Date - Dec 05 , 2025 | 12:08 AM