Share News

Ration రేషన్‌ కోసం ఎదురుచూపు

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:12 PM

Waiting for Ration య్యమ్మవలస మండలం టీకే జమ్ము పంచాయతీలో గిరిజనులు రేషన్‌ సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 16 రోజులు పూర్తయిన నేపథ్యంలో అసలు రేషన్‌ అందుతుందా? లేదా? అని వారు ఆందోళన చెందుతున్నారు.

  Ration  రేషన్‌ కోసం ఎదురుచూపు
కార్డుదారులతో ఈకేవైసీ అప్‌డేషన్‌ చేయిస్తున్న సేల్స్‌మన్‌

ఇంకా 310 మంది అప్‌డేషన్‌ పెండింగ్‌

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలం టీకే జమ్ము పంచాయతీలో గిరిజనులు రేషన్‌ సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 16 రోజులు పూర్తయిన నేపథ్యంలో అసలు రేషన్‌ అందుతుందా? లేదా? అని వారు ఆందోళన చెందుతున్నారు. వివిధ కారణాలతో కార్డుదారుల ఈకేవైసీ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుండడంతో వారికి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ పంచాయతీలో టీకే జమ్ము, గోర్లి, గోర్విలస, కూటం, పాండ్రసింగి, కోడిపిల్లగూడ, జమ్మువలస, చినదోడిజ, పెదదోడిజ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికీ డీఆర్‌ డిపో షాపు నెంబరు 4027 నుంచే బియ్యం అందుతోంది. ఇక్కడ మొత్తం 563 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇది ఆఫ్‌లైన్‌ డీఆర్‌ డిపో అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డుదారుల అప్‌డేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. సిగ్నల్స్‌ సరిగ్గా లేక, చిన్న పిల్లల వేలి ముద్రలు సరిగా పడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. అయితే ఇంకా 310 మంది కార్డుదారుల అప్‌డేషన్‌ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల కొంత ఇబ్బంది అయ్యిందని వీఆర్‌వో దూసి తిరుపతిరావు, కాంట్రాక్ట్‌ సేల్స్‌మన్‌ జీలకర్ర గోపాలరావు తెలిపారు. ఈ విషయం ఎన్‌ఐసీ, జీసీసీ డీఎంకు తెలియజేశామని సేల్స్‌మన్‌ చెప్పారు. నేటి నుంచి పంపిణీ ప్రారంభిస్తామని, రెండు రోజుల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 16 , 2025 | 11:12 PM