రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:27 AM
మండలంలోని కుమిలి గ్రామం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ సచివాలయా నికి చెందిన వీఆర్వో తిరుమలరాజు అప్పలనరసింహరాజు అక్కడికక్కడే మృతిచెందారు.
పూసపాటిరేగ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని కుమిలి గ్రామం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ సచివాలయా నికి చెందిన వీఆర్వో తిరుమలరాజు అప్పలనరసింహరాజు అక్కడికక్కడే మృతిచెందారు. చింతపల్లిలో ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని విజయనగరంలోని తన నివాసానికి బైకుపై వెళ్తున్న సమయంలో కుమిలి వద్ద రోడ్డుపై ఆగిఉన్న ట్రాక్టరును ఢీకొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు ఈయనను గుర్తించి వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం అందజేశారు. ఈ కార్యాలయ సిబ్బంది స్థానిక ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌కు సమాచారం అందజేశారు. వెంటనే రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా స్థానిక ఎస్‌ఐ అక్కడకు చేరుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతుడి కి ఒక కుమారుడు, భార్య ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. ఈయన ఆకశ్మిక మృతి పట్ల రెవెన్యూ సిబ్బంది తీవ్ర దిగ్ర్బాంతి చెందారు.