వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:16 AM
వీఆర్‌ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘ జిల్లా కార్యదర్శి జి.కృష్ణారావు కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ అధికారి కొల్లి శ్రీనివాసరా వుకు వినతిపత్రాన్ని అందించారు.
మక్కువ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వీఆర్‌ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘ జిల్లా కార్యదర్శి జి.కృష్ణారావు కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ అధికారి కొల్లి శ్రీనివాసరా వుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు వీఆర్‌వోలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం మండలాధ్యక్షుడు జి.పవన్, కార్యదర్శి డి.సింహాచలం పాల్గొన్నారు.