ఓటర్ల జాబితాలను పరిశీలించుకోవాలి
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:07 AM
ww
సాలూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సాలూరు నియోజకవర్గంలో 13 బూత్‌లు పెరిగాయని, గతంలో 243 బూత్‌లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 256కు చేరిందని నియోజకవర్గ ఎన్నికల అధికారి సుధారాణి తెలిపారు. బూత్‌లు పెరిగిన విషయానికి సంబంధించి నాయకులు వారివారి అభి ప్రాయాలు తెలియజేయాలని, ఓటర్ల జాబితాలను కూడా పరిశీలించు కోవా లని కోరారు. శనివారం సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజ కీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.