Waterfalls స్వచ్ఛందంగా జలపాతం అభివృద్ధి
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:07 AM
Voluntary Development of Waterfalls గ్రామస్థులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి దళాయివలస వాటర్‌ఫాల్స్ అభివృద్ధి పనులను చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
పనులను పరిశీలించిన డీఆర్‌డీఏ పీడీ
సాలూరు రూరల్ అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): గ్రామస్థులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి దళాయివలస వాటర్‌ఫాల్స్ అభివృద్ధి పనులను చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. ఇందులో భాగంగా దళాయివలస గ్రామస్థులు, మహిళలు, యువత చురుగ్గా ముందుకొచ్చారని వెల్లడించారు. దళాయివలస నుంచి వాటర్ ఫాల్స్ వరకు 5 కిలోమీటర్ల రహదారి వేశారన్నారు. వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకులకు ఇబ్బంది లేకుండా వెదురు కర్రలతో వంతెన నిర్మాణం చేపట్టారని, వాష్‌రూమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రామం నుంచి వాటర్ ఫాల్స్ వరకు పర్యాటకులను బైక్‌లపై తీసుకెళ్లడానికి యువత ముందుకొచ్చినట్లు వెల్లడించారు. కాగా గ్రామస్థుల సహకారంతో దళాయివలస వాటర్‌ఫాల్స్‌ను ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దు తామని తెలిపారు. ఆమె వెంట వెలుగు ఏపీఎం జయమ్మ, సర్పంచ్ తదితరులు ఉన్నారు.