Share News

సారా రహిత జిల్లాగా విజయనగరం

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:04 AM

గ్రామాలు, మండ లాలను సారాలేని గ్రామాలుగా గుర్తించి విజయనగరం జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటిస్తూ నవోదయం-2.0 కమిటీలో తీర్మానించినట్లు కలెక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు.

 సారా రహిత జిల్లాగా విజయనగరం
ఎక్సైజ్‌ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం క్రైం, మే 31 (ఆంధ్రజ్యోతి): గ్రామాలు, మండ లాలను సారాలేని గ్రామాలుగా గుర్తించి విజయనగరం జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటిస్తూ నవోదయం-2.0 కమిటీలో తీర్మానించినట్లు కలెక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. దీంతో నవోదయం-2.0 లక్ష్యం నెరవేరిందని తెలిపారు. శనివారం నవోదయం-2.0 అమలుపై కలె క్టరు అంబేడ్కర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇదే ఒరవడితో ఎక్సైజ్‌ అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోసారా తయారీ గ్రామాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో తయారీలో నిమగ్నమైన వారిని బైండోవర్‌ చేయడం, సారా తయారీకి సహకరిస్తున్న బెల్లం వర్తకులు, బెల్లం సరఫరా చేయ కుండా నిరోధించడం ఆయా గ్రామాల్లో సారాతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం వంటి చర్యలతో జిల్లాలో సారా తయారీని పూర్తిగా నిరోధించగలిగామని చె ప్పారు. భవిష్యత్తులో జిల్లాలో ఎక్కడ సారా తయారీ జరగకుండా ఎక్సైజ్‌ శాఖ నిరంతరం ఆయా ప్రాంతా లపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో బెల్ట్‌షాపులు అధికంగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని విచ్చలవిడిగా ఏర్పాటు చేయకుండా నియంత్రించాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు.అవసరమైతే, తాను కొన్ని ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. జిల్లా ఎక్సైజ్‌ సూపరిడెంట్‌ంట్‌ బి.శ్రీనాఽథుడు మాట్లాడుతూ జిల్లాలో సారా తయారీ చరిత్ర గల వ్యక్తులు, గ్రామాలను గుర్తించి వారి జాబి తాను రూపొందించి, బైండోవర్‌ చేశామని వివరించారు. జిల్లాలోని 27 మండలాల్లో 771 రెవెన్యూ గ్రామాల పరిధిలో 26 సారా ప్రభావిత గ్రామాలు గుర్తించామని, 414 పాత ముద్దాయిలు, 26 బెల్లం వర్తకులను గుర్తించి బైండోవర్‌ చేశామని కలెక్టరు అంబేడ్కర్‌కు వివ రించారు. అనంతరం పదవి విరమణ పొందిన డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌వీఎన్‌ బాబ్జీరావును కలెక్టరు అంబేడ్కర్‌ సత్కరించారు. సమా వేశంలో ఎక్సైజ్‌ శాఖ డీసీ ఎస్‌వీవీఎన్‌ బాబ్జీరావు, సహాయ సూపరి డెంటెంట్‌ దొర, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:04 AM