Share News

Visit of IAS Officers' Team జిల్లాకు ఐఏఎస్‌ల బృందం రాక

ABN , Publish Date - May 12 , 2025 | 11:23 PM

Visit of IAS Officers' Team to the District జిల్లాకు ఐఏఎస్‌ అధికారుల బృందం రానుంది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీయనుంది. మౌలిక వసతులు, తదితర అంశాలను పరిశీలించనుంది.

Visit of IAS Officers' Team   జిల్లాకు ఐఏఎస్‌ల  బృందం రాక

  • ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా

  • మౌలిక వసతుల పరిశీలన

పార్వతీపురం, మే 12(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ఐఏఎస్‌ అధికారుల బృందం రానుంది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీయనుంది. మౌలిక వసతులు, తదితర అంశాలను పరిశీలించనుంది. వాస్తవంగా జిల్లాలో 20 సచివాలయాలు పరిధిలో ఐఏఎస్‌ల బృందం పర్యటించేందుకు ప్రతి పాదనలు వెళ్లాయి. బలిజిపేట, గరుగుబిల్లి, కొమరాడ, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, భామిని, గుమ్మలక్ష్మీపురం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో మిర్తివలస, రావివలస, గుణదతేలేసు, విక్రంపురం, కాశీపట్నం, పి.కోనవలస, పెదమరికి, తోణాం, గుచ్చిమి, మనుమకొండ, ఆర్కేబాయి, తంపటాపల్లి, చినగారపాడు, కిమ్మిలో అధికారుల బృందం పర్యటించే అవకాశం ఉంది. పార్వతీపురం పట్టణంలో జగన్నాథపురం, కొత్త బెలగాం, సాలూరు పట్టణం, పాలకొండలోనూ పర్యటనలకు ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే ఆయా ప్రాంతాల్లో ఐఏఎస్‌ల బృందం ఎక్కడెక్కడ పర్యటిస్తుందన్నది ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు ఆయా గ్రామ , వార్డు సచివాలయాలు పరిధిలో ఉన్న ప్రత్యేక అధికారులతో పాటు అన్నిశాఖల సిబ్బంది నివేదికలు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - May 12 , 2025 | 11:23 PM