స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: డీపీవో
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:58 PM
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రతిసచివాలయ ఉద్యోగి కూడా తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి డి.మల్లికా ర్జునరావు చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్యసమస్యలు రాకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బొండపల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రతిసచివాలయ ఉద్యోగి కూడా తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి డి.మల్లికా ర్జునరావు చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్యసమస్యలు రాకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం మండలంలోని అంబటివలస పంచాయతీలో అయ్యన్న అగ్రహారంలో పారిశుధ్యపనులు, రక్షిత మంచినీటి సరఫరాను పరిశీలించారు. అనంతరం అంబటి వలసలోని సచివాలయం పరిశీలించి రికార్డులు తనిఖీచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.రాము, డిప్యూటీ ఎంపీడీవో ఎ.రఘుపతి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.