పల్లె పండుగతో గ్రామాభివృద్ధి
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:51 PM
పల్లెపండుగ 2.0లో గ్రామాలు సంపూర్ణంగా అభివృద్థి చెందుతాయని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి
డెంకాడ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): పల్లెపండుగ 2.0లో గ్రామాలు సంపూర్ణంగా అభివృద్థి చెందుతాయని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. మండలంలోని ఆకుల పేట గ్రామంలో నిర్మించ నున్న మురుగునీటి సీసీ కాలువలకు ఆమె ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. అందులో భాగంగానే పల్లె పండుగ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వైకుంఠనాయుడు, డిప్యూటీ ఎంపీడీవో కర్రోతు రాజ్‌కుమార్, జనసేన నాయకులు భవిరిశెట్టి శ్రీనివాసరావు, కనకల రామారావు, పైల శంకర్, పిన్నింటి రాజారావు, అట్టాడ ప్రమీల పాల్గొన్నారు.