Share News

ఎరువుల దుకాణంలో విజిలెన్స్‌ దాడులు

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:23 PM

పాచిపెంటలోని శ్రీకృష్ణా స్టోర్స్‌ ఎరువుల దుకాణంపై శ్రీకాకుళం విజిలెన్స్‌ ప్రాంతీయ రీజినల్‌ కార్యాలయ సీఐ ఆర్‌.రవిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

   ఎరువుల దుకాణంలో విజిలెన్స్‌ దాడులు
ఎరువుల దుకాణంలో స్టాక్‌ను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ సీఐ రవిప్రసాద్‌

పాచిపెంట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పాచిపెంటలోని శ్రీకృష్ణా స్టోర్స్‌ ఎరువుల దుకాణంపై శ్రీకాకుళం విజిలెన్స్‌ ప్రాంతీయ రీజినల్‌ కార్యాలయ సీఐ ఆర్‌.రవిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. తొలుత ఎరువుల దుకాణానికి సంబంధించిన రికార్డులు పరిశీలించి అనంతరం స్టాకును లెక్కించారు. రైతులకు అవసరమైన ఎరువులను నిబంధనల మేరకు విక్రయించాలని తెలిపారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి కె.తిరుపతిరావుతో విజిలెన్స్‌ సీఐ మాట్లాడారు. కార్య క్రమంలో దాడుల్లో ఎస్‌ఐ కె.వెంకటసురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు

Updated Date - Aug 24 , 2025 | 11:23 PM