Share News

Vigilance ఏజెన్సీలో సీసీ రహదారులపై విజి‘లెన్స్‌ ’

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:02 AM

Vigilance on CC Roads in Agency Areas సీతంపేట ఐటీడీఏ పరిధిలో గతంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రహదారిను బుధవారం శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. 2019-2023 మధ్య కాలంలో ఏజెన్సీలో నిర్మించిన 32 రహదారులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పలుమార్లు సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టారు.

Vigilance   ఏజెన్సీలో సీసీ రహదారులపై విజి‘లెన్స్‌ ’
కోర్‌కటింగ్‌ మిషన్‌ ద్వారా సీసీ రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ ఎస్పీ

సీతంపేట రూరల్‌,జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో గతంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రహదారిను బుధవారం శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. 2019-2023 మధ్య కాలంలో ఏజెన్సీలో నిర్మించిన 32 రహదారులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పలుమార్లు సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజాగా కోర్‌కటింగ్‌ మిషన్‌ ద్వారా సీసీ రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జోడుమానుగూడ, లోకోత్తవలస-నారాయణగూడ, దిగువ సంకిలిగూడ-ఎగువ సంకిలి, బొంగుడుగూడ-బుగతగూడ సీసీ రహదారులను కోర్‌కటింగ్‌ యంత్రంతో విజిలెన్స్‌ అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ విభాగం డీఈ సత్యనారాయణ, ఏఇలు గణేష్‌, ప్రేమ్‌కుమార్‌, సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌ డీఈ సింహాచలం, ఏఈ నాగభూషణ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:02 AM