Share News

'Adudam Andhra' ‘ఆడుదాం..ఆంధ్రా’ నిధులపై విజి‘లెన్స్‌’

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:32 PM

Vigilance on 'Adudam Andhra' Funds గత వైసీపీ ప్రభుత్వంలో (2023-24) నిర్వహించిన ‘ఆడుదాం..ఆంరఽధా’ క్రీడా పోటీలకు సంబంధించి నిధుల మంజూరు, ఖర్చులపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపల్‌, ఎంపీడీవో కార్యాల యాల్లో విజిలెన్స్‌ సీఐ సతీష్‌కుమార్‌ (శ్రీకాకుళం) ఆధ్వర్యంలో ఎస్‌ఐ రామారావు తదితరులు రికార్డుల పరిశీలించారు.

 'Adudam Andhra'  ‘ఆడుదాం..ఆంధ్రా’ నిధులపై విజి‘లెన్స్‌’
మున్సిపల్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

  • రికార్డుల పరిశీలన

పార్వతీపురం టౌన్‌, జూన్‌17(ఆంరఽధజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో (2023-24) నిర్వహించిన ‘ఆడుదాం..ఆంరఽధా’ క్రీడా పోటీలకు సంబంధించి నిధుల మంజూరు, ఖర్చులపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపల్‌, ఎంపీడీవో కార్యాల యాల్లో విజిలెన్స్‌ సీఐ సతీష్‌కుమార్‌ (శ్రీకాకుళం) ఆధ్వర్యంలో ఎస్‌ఐ రామారావు తదితరులు రికార్డుల పరిశీలించారు. నిధులు మంజూరు, వినియోగంపై సంబంధిత సిబ్బంది వివరణ కోరారు. అనంతరం సీఐ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఆడుదాం..ఆంధ్రా ’ క్రీడలకు సంబంధించి నియోజకవర్గాల్లో నిధుల ఖర్చు తదితర అంశాలపై విచారణ చేపడుతున్నామన్నారు. త్వరలోనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామని వెల్లడించారు.

లోతుగా విచారణ

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబరు నుంచి 2024 జనవరి రెండో వారం వరకు ‘ఆడుదాం.. ఆంధ్రా’ నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. అప్పట్లో వాటి నిర్వహణకు వైసీపీ ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు కేటాయించింది. మండలస్థాయి వచ్చేసరికి మరిన్ని నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గ , జిల్లా స్థాయికి వచ్చే సరికి వైసీపీ నాయకుల కన్నుసన్నల్లో అధికారులు ఈ పోటీలు నిర్వహించి నిధులు వినియోగించారు. అయితే ‘ఆడుదాం..ఆంధ్రా’ పేరిట మంజూరైన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్‌ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలో అప్పట్లో ఆడుదాం..ఆంధ్రా నిర్వహణలో పాల్గొన్న సచివాలయాలు, మున్సిపల్‌ అధికారులు, ఎంపీడీవోలు ఉలిక్కి పడుతున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:32 PM