బాధితుల సమస్యలను పరిష్కరించాలి: ఎస్పీ
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:41 PM
జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారుల ను ఆదేశించారు. సోమవారం విజయనగ రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 39 ఫిర్యాదులు స్వీకరించారు.
విజయనగరం క్రైం, జూలై 21 ( ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారుల ను ఆదేశించారు. సోమవారం విజయనగ రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 39 ఫిర్యాదులు స్వీకరించారు. భూ తగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలు, మోసాలకు పాల్పడడంపై ఐదేసి చొప్పున, ఇతర అంశాలకు సంబంధించి 18 ఫిర్యాదులు అందాయి. వాటి పూర్వాపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవమైతే, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ఏడు రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టి, తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, సీఐలు లీలారావు, సుధాకర్, ఎస్‌ఐ ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.