Share News

Venkata Subba Rao assumes charge as JNTU VC జేఎన్‌టీయూ వీసీగా వెంకటసుబ్బారావు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:58 PM

Venkata Subba Rao assumes charge as JNTU VC జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొఫెసర్‌ వి.వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

Venkata Subba Rao assumes charge as JNTU VC జేఎన్‌టీయూ వీసీగా  వెంకటసుబ్బారావు బాధ్యతల స్వీకరణ
జేఎన్‌టీయు (గురజాడ) విశ్వవిద్యాలయం వీసీగా బాధ్యతలు చేపడుతున్న ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు

జేఎన్‌టీయూ వీసీగా

వెంకటసుబ్బారావు బాధ్యతల స్వీకరణ

విజయనగరం రూరల్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొఫెసర్‌ వి.వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జేఎన్‌టీయులో మెకానికల్‌ విభాగం ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను ఇక్కడకు గవర్నర్‌ బదిలీ చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విద్యలనగరంలో ఉపకులపతిగా రావడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. విశ్వవిద్యాలయంలో పారదర్శకతను నెలకొల్పడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన సుబ్బారావుకు రిజిస్ట్రార్‌ జయసుమతో పాటు, కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Oct 13 , 2025 | 11:58 PM