Share News

వీణల కళాకారులను ఆదుకోవాలి

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:30 AM

బొబ్బిలి, వాడాడలో గల వీణల తయారీ కళాకారులను ఆదుకోవాలని బొబ్బిలి ఎమ్మె ల్యే బేబీనాయన కోరారు. అమరావతిలో రాష్ట్ర చేనేత జౌళిశాఖమంత్రి సబితకు బేబీనాయన వినతిపత్రం అందజేశారు. వీణల తయారీ కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.

వీణల కళాకారులను ఆదుకోవాలి
మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన :

బొబ్బిలి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి, వాడాడలో గల వీణల తయారీ కళాకారులను ఆదుకోవాలని బొబ్బిలి ఎమ్మె ల్యే బేబీనాయన కోరారు. అమరావతిలో రాష్ట్ర చేనేత జౌళిశాఖమంత్రి సబితకు బేబీనాయన వినతిపత్రం అందజేశారు. వీణల తయారీ కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.

సస్యశ్యామలం చేయాలి

నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేం దుకు సహకరించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు. ఇరిగేషన్‌శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలి శారు.ఈ సందర్భంగా బేబీనాయన కూరగా యలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. బొబ్బిలి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్‌ పనులకు సంబంధించిన వివరా లను మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. తొలు త ఎమ్మెల్యే బేబీనాయన విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయాన్ని సదర్శించి అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Sep 28 , 2025 | 12:30 AM