Share News

Varalakshmi వరలక్ష్మీ కరుణించు!

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:39 PM

Varalakshmi, Bless Us! శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా జిల్లావాసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు చేశారు. మహిళలు ఇళ్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలు, పిండి వంటలను వండి నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు చేశారు.

 Varalakshmi  వరలక్ష్మీ కరుణించు!
పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో కుంకుమపూజలు చేస్త్తున్న మహిళలు

  • అమ్మవారి ఆలయాలు కిటకిట

  • వెల్లివిరిసిన శ్రావణ శోభ

పాలకొండ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా జిల్లావాసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు చేశారు. మహిళలు ఇళ్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలు, పిండి వంటలను వండి నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో వీవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు, పూజలు చేశారు. చిన్నారులకు అన్నప్రసాదన, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బం దులు లేకుండా చర్యలు చేపట్టారు. కాగా అంతకుముందు సబ్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతో పాటు 15 మండలాల్లోనూ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అంతటా శ్రావణ శోభ వెల్లివిరిసింది.

Updated Date - Aug 08 , 2025 | 11:39 PM