వ్యాను, బైకు ఢీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:53 PM
మండలంలోని చిన్నశిర్లాం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ బైకు, వ్యాను ఢీకొన్నాయి.
రేగిడి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నశిర్లాం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ బైకు, వ్యాను ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాలకొండ మండలం బెజ్జి గ్రామానికి చెందిన బైకిస్టు బొడ్డు భానుప్రకాష్(25) అక్కడికక్కడే మృతిచెందాడు. రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. భానుప్రకాష్ ఏడాదిన్నర నుంచి భార్య దేవితో పాలకొండలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులు ఫర్నీచర్ షాపులో పనిచేయగా, ఇటీవల విశాఖపట్నంలో ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. ఆదివారం వ్యక్తిగత పని నిమిత్తం స్నేహితుడు బైకు తీసుకుని రాజాం వెళ్తున్నాడు. ఎదురుగా పాలకొండ వైపు వస్తున్న వ్యాను, బైకు ఢీకొన్నాయి. ఆ సమయంలో వ్యాను అదుపుతప్పి సమీప పొలాల్లోకి దూసికెళ్లింది. వ్యానులో ఉన్నవారికి ఎటువంటి అపాయం కాలేదు. భానుప్రకాష్‌కు తల భాగంలో తీవ్ర గాయామై అక్కడిక్కడే మృతిచెందాడు. ఈయన తండ్రి శ్రీనివాసరావు కొద్దికాలం కిందటే మృతిచె ందగా, తల్లి లక్ష్మి, సొదరుడు ప్రసన్నకుమార్ స్వగ్రామంలో ఉంటున్నారు. ఎస్‌ఐ బాలకృష్ణ, సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం తరలించారు. కేసు నమోదు చేశారు.