Share News

వ్యాన్‌, బైక్‌ ఢీ..

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:54 PM

రామభద్రపురం బైపాస్‌ రోడ్డులో శనివా రం అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది.

వ్యాన్‌, బైక్‌ ఢీ..

  • పేలిన ఆయిల్‌ ట్యాంక్‌

  • రెండు వాహనాల దగ్ధం

  • ఒకరికి గాయాలు

రామభద్రపురం, అక్టోబరు 26(ఆంధ్రజ్యో తి): రామభద్రపురం బైపాస్‌ రోడ్డులో శనివా రం అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనాన్ని వ్యాన్‌ ఢీనడంతో ద్విచక్రవాహ నం ట్యాంకర్‌ పేలింది. దీంతో మంటలు చెలరేగడంతో వ్యాన్‌, ద్విచక్రవాహనం దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. పాచిపెంట మండలంలోని గడివలస గ్రామానికి చెందిన బెవర అప్పలనాయుడు ద్విచక్ర వాహనంపై బాడంగి మండలంలోని రౌతువానివలస అత్తగారింటికి వెళ్తున్నాడు. అదే సమయంలో విజయనగరం నుంచి సాలూరు వైపు గోనెసంచుల లోడుతో వ్యాన్‌ వెళ్తోంది. ఈ క్రమంలో వ్యాన్‌ సాలూరు నుంచి రామభద్రపురం వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైక్‌ వ్యాన్‌ కింద ఉండిపోయింది. ఆ సమయంలో ద్విచక్రవాహనం ట్యాంకరు పేలిపోవడంతో పెట్రోల్‌ బయటకు వచ్చి మంటలు చెలరేగాయి. ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి తుల్లిపోయి పక్కనపడిపోయాడు. ఎగిసిపడిన మంటలకు వ్యాన్‌తోపాటు, ద్విచక్రవాహనం కాలిబూడిదయ్యాయి. ద్విచక్రవాహన చోదకుడి తల, కాలుపైన గాయాలుకావడంతో 108లో బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌లో ఉన్న ఇద్దరు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే బాడంగి అగ్నిమాపక అధికారి రాంసూర్యారావు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి వ్యాన్‌లోని గోనెసంచులకు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు మంటలు చెలరేగుతున్నాయి. ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. అయితే ఇంత ఘోర ప్రమాదంలో కూడా ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 11:54 PM