‘వాహనమిత్ర’ ప్రకటించాలి
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:55 PM
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించకముందే వాహనమిత్ర పథకాన్ని ప్రకటించాలని ఆటో, క్యాబ్ డ్రైవర్ల యూనియన్ నాయకులు డిమాండ్‌చేశారు
సాలూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించకముందే వాహనమిత్ర పథకాన్ని ప్రకటించాలని ఆటో, క్యాబ్ డ్రైవర్ల యూనియన్ నాయకులు డిమాండ్‌చేశారు.ప్రతి డ్రైవర్‌కు రూ.15వేలు చెల్లించాలని కోరారు. ఆదివారం పట్టణంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆటో క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వై.నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న డ్రైవర్ల సంక్షేమం మరచిపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని తెలిపారు. ఎన్నికల ముందుఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలు చేసి రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో -21 వెంటనే రద్దుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయ కులు సంతు, గున్నంనాయుడు, అక్కా అప్పారావు, గొర్లె రమేష్, మజ్జి అప్పారావు, అంపోలు సంతోష్‌కుమార్, పిన్నింటి కేశవ, పూడి ప్రవీణ్, పూడి ఈశ్వరరావు, జర జాపు జ్యోతిష్ట, సోమేశు పాల్గొన్నారు.